ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ఫలితాల కోసం నిరీక్షణే ముగిసింది. ఎవరికి వారు రిజల్ట్‌పై నమ్మకంతో ఉన్నారు. అధికార వైసీపీ మరోసారి గద్దెనెక్కుతుందా? లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా? అన్నది జూన్ 4న తేలుతుంది. ఈ లోగా నాయకులు రిలాక్స్ అవుతున్నారు. కానీ బీజేపీలోని కొంతమంది లీడర్లు మాత్రం ఎన్నికల ప్రచారంలోనూ అట్టిముట్టనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత వీళ్ల ప్లాన్ ఏమిటన్నది కూడా సస్పెన్స్‌గానే ఉంది. ఆ నాయకులే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో సోము వీర్రాజు ఎక్కువగా కనిపించలేదు. మొదటి నుంచి టీడీపీతో పొత్తును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక మిన్నకుండిపోయారు. అంతే కాకుండా ఎన్నిలక నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాలను ఎంచుకున్న తీరు తదితర పరిణామాలు వీర్రాజుకు నచ్చలేదని తెలిసింది. దీంతో ఆయన సైలెంట్‌గానే ఉండిపోయారు. రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేసినా వీర్రాజు పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు.
ఇక కదిరి నియోజకవర్గానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి మౌనం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా టికెట్ దక్కే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. మరోవైపు మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు కూడా అంతే. విశాఖ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన కేవలం ఒక నియోజకవర్గంలో ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపించారు.
This post was last modified on May 22, 2024 2:37 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…