భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన మాజీ ప్రధాని మనవడి కోసం బ్లూ కార్నర్ నోటీసులు సహా అరెస్టు వారెంటు జారీ చేయడం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయనే మాజీ ప్రధాని దేవెగౌడ.. ఆయన మనవడే.. సెక్స్ ర్యాకెట్ కుంభకోణంలో చిక్కుకున్న పార్లమెంటు(హాసన్) సభ్యుడు 36 ఏళ్ల ప్రజ్వల్. తాజాగా ఈయనపై అరెస్టు వారెంటు జారీ అయింది.
రెండు రోజుల కిందటే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీనిని సహజంగా అత్యంత దారుణమైన నేరాలు చేసిన వారిని ఉద్దేశించి.. ఇతర దేశాల్లో ఆచూకీ తెలిస్తే.. తమకు చెప్పాలని జారీ చేసే నోటీసు. రెడ్ కార్నర్ అంటే.. ఎక్కడ కనిపించినా.. అదుపులో ఉంచుకుని.. తమకు సమాచారం ఇవ్వాలని జారీ చేస్తారు. ప్రజ్వల్‌పై తాజాగా భారత ప్రభుత్వం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు దేవె గౌడ మనవడిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
అంతేకాదు.. ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా ఆయనను అరెస్టు చేయాలని.. వారెంట్ జారీ చేసింది. సుమారు 3 వేల మందికిపైగాఉద్యోగినులు, యువతులపై అత్యాచారం చేయడంతోపాటు.. వాటిని వీడియోలు తీయడం.. వంటి ఘటనలు వెలుగు చూడడంతో ప్రజ్వల్‌ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక, ఈ విషయం తెలిసి కూడా దాచిపెట్టారని.. ఇంట్లో పని మనిషిని నిజం చెప్పకుండా అపహరించారన్న నేరంపై ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రేవణ్ణను కూడా అరెస్టు చేయడం.. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు రావడం తెలిసిందే.
ఇక, ప్రజ్వల్‌ప్రస్తుతం బ్రిటన్‌కువెళ్లారని ప్రచారంలో ఉన్నా.. నిఘా అధికారులు మాత్రం.. ఆయన పలు దేశాలకు తిరుగుతూ.. ఎక్కడా చిక్కకుండా తప్పించుకుంటున్నాడనితెలిపారు. దీంతో ప్రజ్వల్ పేరుతో ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి.. నిధులు అందకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. ఈ పరిణామాలు.. కేవలం జేడీఎస్‌నే కాదు.. దేవెగౌడ కుటుంబాన్ని మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తాన్ని కూడా కలవరపరుస్తున్నాయి. దీనికి కారణం.. “మాజీ ప్రధాని మనవడి కోసం… బ్లూ కార్నర్ నోటీసు.. అరెస్టు వారెంటు!” అంటూ.. అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడమే!!
This post was last modified on May 19, 2024 2:53 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…