రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటు వైపు అడుగులు వేసింది. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ చీఫ్.. సోనియాగాంధీ కూడా సెంటిమెంటు బాంబునే పేల్చారు. ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల కిందట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఖాళీ అయిన సోనియాగాంధీ స్థానాన్ని(రాయబరేలి) ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎంచుకున్నారు.
యూపీలోని రాయబరేలి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ తొలిసారిపోటీ చేస్తున్నారు(ఈ నియోజకవర్గంలో). దీంతో సోనియా గాంధీ శుక్రవారం ఇక్కడ పర్యటించి.. తన కుమారుడిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. తన కుమారుడిని ఆదుకోవాల్సింది.. మీరే నంటూ ఆమె సెంటిమెంటు డైలాగులు పేల్చారు. తన కుమారుడిని ఇక్కడి ప్రజలచేతుల్లో పెడుతున్నట్టు చెప్పారు. సుదీర్ఘ కాలంగా తనను ఇక్కడ ప్రజలు, ఓటర్లు ఆదరిస్తున్నారని.. తన అనారోగ్య సమస్యలతో ఇక్కడ పోటీ చేయడం లేదని.. ఆమె మరో సెంటిమెంటు ముక్క విసిరారు. దీంతో తన కుమారుడిని ఇక్కడ బరిలో నిలిపినట్టు సోనియాగాంధీ చెప్పుకొచ్చారు.
రాహుల్‌ను ఆశీర్వదించాలని కూడా సొనియాగాంధీ పిలుపునిచ్చారు. అయితే.. ఈ సెంటిమెంటు ఎంత వరకు పనిచేస్తుందన్నది ప్రశ్న. 2004 నుంచి ఇప్పటి వరకు సోనియాగాంధీ వరుసగా రాయబరేలి నియోజకవర్గంలో విజయం దక్కించుకుంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఆమె ఎన్నికల ప్రచారానికి తప్ప.. ఇన్నేళ్లలో ఏ నాడూ కూడా నియోజకవర్గానికి రాకపోవడం విశేషం. కానీ, ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు మాత్రం జరిగాయి. ఇదే విషయాన్ని తాజాగా సోనియా చెప్పుకొచ్చారు. 2019లో ఒక్కసారి మాత్రమే తాను వచ్చానని.. అయినా ఇది తనకు పుట్టిల్లు లాంటిందని చెబుతూ.. పుట్టిల్లుకు మేలు చేశానని మరో సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. మొత్తంగా చూస్తే.. ఈ సెంటిమెంటు ఏమేరకు రాహుల్‌కు కలిసి వస్తుందనేది చూడాలి.
This post was last modified on May 18, 2024 7:38 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…