ఏపీలో ఎన్నికల తర్వాత.. చెలరేగిన హింసపై జాతీయ స్థాయిలో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనిలో కీలకమైన అత్యంత సమస్యాత్మకమైన జిల్లాలు, నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కరడుగట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్(అత్యంత సమస్యాత్మక ప్రాంతం)లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశలో జరిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడా చిన్న బొట్టు రక్తం కూడా కారలేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసులను కూడా కొట్టలేదు. కనీసం లాఠీ చార్జి ఘటనలు కూడా వెలుగు చూడలేదు. మరి అంత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే అంత ప్రశాంతంగా ఎన్నికలుజరిగినప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోదశ పోలింగ్ తర్వాత.. ఇంత హింస చెలరేగింది? అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. పల్నాడు ప్రాంతంలోని మూడు కీలక నియోజకవర్గాల్లో్ (మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి) ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయనేది ప్రశ్న. ఇదే విషయం జాతీయ స్థాయిలోనూ చర్చకు వచ్చింది.
జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఏపీపై ఫోకస్ చేసింది. చిత్తూరులో జరిగిన ఘటనను పదే పదే ప్రసారం చేశాయి. అదేవిధంగా అనంతపురంలో ఏకంగా సీఐపైనే దాడి జరగడం.. రక్తమోడుతూనే ఆయన విధులు నిర్వహించడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎందుకు అంచనా వేయలేక పోయారని సీఎస్, డీజీపీలను నిలదీసింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ హింసను నిలువరించాలని కోరారు. చంద్రబాబు అయితే.. పదే పదే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.
This post was last modified on May 16, 2024 3:21 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…