ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు.
ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు అనూహ్యమైన రీతిలో జరిగినట్లు తెలుస్తోంది.
ఇక, తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన స్ట్రైక్ రేట్ మీద బెట్టింగులు ఊపందుకున్నాయి. 98 శాతం స్ట్రైక్ రేట్.. అనే మాట, టీడీపీ – జనసేన మధ్య పొత్తుల సందర్భంగా సీట్ల పంపకాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చింది.
రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అనే మాట చాలా చాలా అరుదుగా వాడుతుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణే తొలిసారిగా వాడారేమో కూడా.! చాలామంది మొదట ఈ 98 శాతం స్ట్రైక్ రేట్ వ్యవహారంపై నవ్వుకున్నారు. కానీ, ఆ స్ట్రైక్ రేట్ మీదనే బెట్టింగులు జరుగుతున్నాయిప్పుడు.
80 నుంచి 85 శాతం స్ట్రైక్ రేట్ చుట్టూ ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేనాని సాధించబోయే మెజార్టీ మీద బెట్టింగుల కంటే కూడా ఈ స్ట్రైక్ రేట్ చుట్టూనే బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ స్ట్రైక్ రేట్ ప్రకారం జనసేన పార్టీకి 15 నుంచి 18 అసెంబ్లీ సీట్లు రావాల్సి వుంది.
వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా జనసేన గెలవబోయే సీట్ల సంఖ్య ఇదేనని తేలుతుండడం ఆసక్తికరమైన అంశం.
This post was last modified on May 14, 2024 4:45 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…