ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్‌ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ మంగళవారం దాఖలు చేశారు.
దీనికి సంబంధించి.. ఎప్పటి లాగానే మోడీ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఎంపీ అభ్యర్థులను నలుగురు బలపరచాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ఎప్పుడూ.. ఆ నలుగురిని వివిధ కులాలకు చెందిన వారి నుంచి ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు కూడా.. ఓబీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన ప్రతిపాదించేలా చేసుకున్నారు. ఇక, మోడీ నామినేషన్ ఘట్టం ముందుగానే నిర్ణయించుకున్నట్టు అంగరంగ వైభవంగా జరిగింది.
బీజేపీ సహా ఎన్టీయే పక్షాలకు చెందిన 100 మంది నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మోడీ నామినేషన్ వేయడాన్ని ఒక చరిత్రాత్మక సందర్భంగా బాబు అభివర్ణించారు. వారణాసిని పవిత్ర ప్రదేశంగా పేర్కొన్న ఆయన.. మూడో సారి మోడీ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని చెప్పారు. గత పదేళ్లలో వారణాసి నియోజకవర్గం రూపు రేఖలను మోడీ ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్డీయే కూటమి మోడీ నేతృత్వంలో 400 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
This post was last modified on May 14, 2024 4:22 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…