రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత.. కూటమి అధికారంలోకి వస్తుందన్న టాక్ జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. కూటమి గెలిచి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. తన మంత్రివర్గంలో రఘురామ కృష్ణరాజుకు అవకాశం కల్పిస్తారని ఇక్కడ చర్చ సాగుతుండడం గమనార్హం.
రఘురామ తరఫున ఉన్న అనుచర వర్గం కూడా ఇదే చెబుతోంది. ఇక, నియోజకవర్గంలోనూ జోరుగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. వైసీపీని ఎదిరించడంతోపాటు.. ఐదేళ్లపాటు.. వైసీపీని ఇరుకున పెట్టి.. టీడీపీ తరఫున ప్రత్యక్షంగా, పరోక్షంగా వాయిస్ వినిపించారు రఘురామ. అందుకే..ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు పట్టుబట్టి.. తన వారిని ఒప్పించి మరీ ఉండి నుంచి రఘురామకు అవకాశం కల్పించారు. ఇక్కడ రఘురామ కూడా బాగానే ప్రచారం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో అటు కూటమి సర్కారు ఏర్పాటు, ఇటు రఘరామ గెలుపు ఖాయమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు అండగా ఉండేలా.. ముఖ్యంగా ప్రతిపక్షంగా మారే వైసీపీని మరింత ఇరుకున పెట్టేలా.. ఊపిరి సలపకుండా చేయాలంటే.. రఘురామ వంటి ఫైర్‌బ్రాండ్‌ను తన మంత్రివర్గంలో పెట్టుకుంటే చంద్రబాబుకు కలిసి వస్తుందని.. ఆయన స్వేచ్ఛగా పాలనపై దృష్టి పెడితే.. ప్రతిపక్షం సంగతిని రఘురామ చూసుకుంటారని.. ఆయన వర్గం చెబుతోంది.
అందుకే రఘురామకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆయన అనుచరులు విశ్వసిస్తున్నారు. నియోజకవర్గంలోని క్షత్రియ సామాజిక వర్గంలోనూ ఎన్నికలకు ముందు నాలుగు రోజులు కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. దీంతో రఘురామ మంత్రి కావడం ఖాయమనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అయితే.. ఇక్కడ మరో చిక్కు ఉంది. పిఠాపురంలో సీటు త్యాగం చేసిన సత్యనారాయణ వర్మకు కూడా.. చంద్రబాబు మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. మరి ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తారా? అనేది కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట…
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ…
‘పుష్ప...పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్...’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌కు 'ఫార్ములా ఈ - రేస్' ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే…
పేద్ద గన్ పట్టుకుని.. ఆరు అడుగుల ఎత్తుతో చూడగానే నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఈ అధికారి.. ఐపీఎస్…
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్...ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ…