నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను అందరికీ అతీతం అనుకుంటే తెనాలి ఎమ్మెల్యేకు జరిగిన పరాభవమే ఎదురవుతుంది.
ఓటు వేయడానికి వెళ్లిన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అక్కడ లైన్లో నిలబడిన ఓటర్లను పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న ఓటరు అభ్యంతరం చెప్పాడు.
ఇంత మంది క్యూలో నిల్చుంటే నేరుగా ఎలా లోపలికి వెళ్తావని ప్రశ్నించాడు. దీంతో నన్నే ఆపుతావా అంటూ ఎమ్మెల్యే ఓటరు చెంప మీద కొట్టాడు. హఠాత్పరిణామం నుండి తేరుకున్న ఓటరు అంతే వేగంతో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు.
ఇది చూసిన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటర్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే, అతని అనుచరుల దౌర్జన్యంపై సామాన్య ఓటర్లు మండిపడుతున్నారు.
This post was last modified on May 13, 2024 1:59 pm
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేలోని నోబెల్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా సమాచారం…
టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే…
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు.…
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యవ్వనంలో అమ్మాయిల కోసం…
అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు…