రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా వారి మాటల్లో మొదట వచ్చేది ఎన్నికల అంశమే.
అంతలా తెలుగువారి జీవితాల్లో భాగంగా మారిన ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నది ఓటర్లు ఈ రోజు తీర్పు ఇవ్వనున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే ఓటర్ల తీర్పు వెల్లడి కావటానికి మరో మూడు వారాల సమయం పట్టనుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రజల నాడి ఎలా ఉందన్న దానికి తగ్గట్లుగా బెట్టింగ్ మార్కెట్ ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కీలకమైన పోలింగ్ కు ఒక రోజు ముందు (ఆదివారం) ఏపీ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ మార్కెట్ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటం ద్వారా ఏపీలో ప్రజల మైండ్ సెట్ ఏ రీతిలో ఉందన్న అంశాన్ని అంచనా వేసే వీలుందని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బెట్టింగ్ మార్కెట్ లో వైసీపీ విజయవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో జరుగుతున్న ఎన్నికల మీద బెట్టింగ్ మార్కెట్ లో వేలాది కోట్ల రూపాయిలు బెట్టింగ్ జరిగినట్లుగా సమాచారం. ఆదివారం రాత్రి వేళకు వైసీపీకి 71 సీట్లు కూడా రావన్న దానిపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల క్రితం ఇది 81-84 మధ్య ఉండటం గమనార్హం.
అదే సమయంలో విపక్షంలో ఉన్న టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య 87-90 మధ్య ఉంటాయని.. చెబుతున్నారు. 87 కంటే తక్కువ వచ్చే ఛాన్సు లేదంటూ బెట్టింగులు కాస్తున్నారు. ఈ సంఖ్య కూటమిలోని జనసేన.. బీజేపీలతో సంబంధం లేకుండా వచ్చే సీట్లుగా చెబుతున్నారు.
బెట్టింగ్ మార్కెట్ అంచనాలతో చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఒక్కటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుందని.. బొటాబొటీ మెజార్టీతో సర్కారు ఏర్పడుతుందంటున్నారు. కూటమికి 120కి పైగా స్థానాలు వస్తాయన్న అంచనాలతో బెట్టింగ్ ఒకటికి రెండు నిష్పత్తిలో పందేలు జరుగుతున్నట్లుగా సమాచారం. నెల క్రితం 100-110 ఉన్న సీట్లు తాజాగా మరింత మెరుగుపడటం గమనార్హం.
ఇప్పుడు 120-125 మధ్య బెట్టింగులు నడుస్తున్నాయి. కూటమికి అనుకూలంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భీమవరం భారీగా సాగాయని చెబుతున్నారు. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయి? అన్నది తేలాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు.
This post was last modified on May 13, 2024 1:56 pm
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…