కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు. అంతేకాదు.. చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా వ్యవస్థను తీసుకువచ్చారు. అన్ని పోలింగ్ బూతులను వెబ్ క్యాస్టింగ్ చేశారు. అంటే.. ఇక్కడ ప్రతిదీ రికార్డు చేశారు. అయినా.. ఆగడాలు.. ఆగలేదు. దాడులకు బ్రేక్ పడలేదు. అదే.. ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండే.. పల్నాడు ప్రాంతం. ఇక్కడి నాలుగు నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల సంఘం సమస్యాత్మకం కాదు.. అత్యంత సమస్యాత్మకంగా తేల్చింది.
మాచర్లలో టీడీపీ ఏజెంట్లను పోలింగ్ బూతులకు వెళ్లకుండా.. వైసీపీ నాయకులు అడ్డుకున్నారని.. టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు. అంతేకాదు.. చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారని వారు ఆరోపించారు. ఇక్కడ పోలీసులు ఉన్నా కూడా.. దాడి చేస్తున్నవారిని అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.
గురజాలలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని.. ఇరు పక్షాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
పెదకూరపాడులో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. వాస్తవానికి ఇది ప్రశాంతమైన నియోజకవర్గం. కానీ.. ఈ సారి మాత్రం ఈ నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా పేర్కొంది. అనుకున్నట్టుగా.. ఇక్కడ కూడా రెచ్చగొట్టేవిధంగా నాయకులు కామెంట్లు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు.
వినుకొండలోనూ వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల్లో ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు, టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేసుకున్నారు. అయితే.. ఇక్కడ పటిష్ట భద్రత, భారీ ఎత్తున బలగాలను ఏర్పాటు చేసినా.. పరిస్థితిలో మార్పు లేక పోవడం గమనార్హం.
This post was last modified on May 13, 2024 11:35 am
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…