ఏపీలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ఆశాజనకంగానే సాగుతోంది. ఉదయం 5-6 మధ్యే పోలింగ్ బూతుల ముందు ఓటర్లు బారులు తీరారు. నిర్దేశిత సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు.. పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్రక్రియ సాగిపోయింది.
అయితే.. చిత్రంగా గత 2019 ఎన్నికల సమయంలో ఉదయం 9 గంటల సమయానికి అంటే.. పోలింగ్ ప్రారంభమైన రెండుగంటల వ్యవధిలో 5-6 శాతం మాత్రమే నమోదైన ఓట్లు.. తాజా ఎన్నికల్లో దాదాపు 10 శాతానికి రీచ్ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు మన్యం వంటి మారు మూల జిల్లాల్లో కూడా.. ఉదయం 9 గంటలకు 6.77 శాతంనమోదైంది. ఇక, బాపట్లలో 11.36 శాతం, చిత్తూరులో 11.84 శాతం పోలింగ్ నమోదైం ది. గుంటూరులో యధావిధిగా ఘర్షణలు, గొడవలతో పోలింగ్‌కు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ అత్యంత తక్కువగా 6.17 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది.. సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా.. తొలి రెండు గంటల్లో 12.09 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవర్ రికార్డ్‌గా అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన ఆడపడుచులు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతలు భారీ ఎత్తున ప్రచారం చేయడం , కొంగు చాపి అడుగుతున్నా.. అంటూ షర్మిల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం తెలిసిందే.
కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో ఓట్లు పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి సాయంత్రం వరకు సమయం ఉన్న నేపథ్యంలో 99 శాతం వరకు పోలింగ్ నమోదైనా ఆశ్చర్యం లేదు. గత ఎన్నికల్లో 82 శాతం ఇక్కడ ఓట్లు పోలయ్యాయి.
This post was last modified on May 13, 2024 11:00 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…