టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఆయన బాబాయి కోన రఘుపతి వైసీపీ ఎమ్మెల్యే. ఆయన కోసమే గత ఎన్నికల ముంగిట వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం చేశాడు కోన. ఒకప్పుడు పవన్ నా సోల్‌మేట్ అన్న కోన.. తర్వాత వైసీపీలో చేరి పవన్ మీద ఘాటు విమర్శలు చేయడంతో అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా జగన్ సర్కారును కొనియాడుతూ కోన పెడుతున్న పోస్టుల పట్ల నెటిజన్లు మామూలుగా మండిపడట్లేదు.
హైవేను చూపించి జగన్ ప్రభుత్వం అద్భుతమైన రోడ్లు వేసిందని.. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఇల్లు చూపించి ఏపీ రూపు రేఖలు మారిపోయాయని.. ఒక ఆసుపత్రి ఫొటో చూపించి మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేశాయని ఆయన విడ్డూరమైన పోస్టులు పెట్టి నెటిజన్లతో తిట్లు తిన్నారు.
ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు బాపట్లలో ఒక ఎస్సీ కార్యకర్త మీద పోలీస్ స్టేషన్లో చేయి చేసుకున్న ఉదంతంతో కోన వెంకట్ మరింతగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. కత్తి రాజేశ్వరావు అనే చిన్నస్థాయి వైసీపీ లీడర్.. ఎన్నికలకు రెండు రోజుల ముందు టీడీపీలో చేరాడు. అతడితో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఐతే తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు కోన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కత్తి రాజేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారి సమక్షంలోనే స్టేషన్లో కోన.. కత్తి రాజేశ్వరరావుపై చేయి చేసుకున్నాడట. కులం పేరుతో దూషిస్తూ నిన్ను చంపితే దిక్కెవరురా అని కోన బెదిరించినట్లు, పోలీసులు కూడా అతడిపై చేయి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకుని టీడీపీ నేతలు స్టేషన్‌కు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేశ్వరరావు.. కోనతో పాటు వైసీపీ నేతలు, పోలీసులపై ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అంతే కాక ఎస్ఐ జనార్దన్ మీద ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
This post was last modified on May 12, 2024 2:30 pm
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…