140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే దేశంలో ఉన్న 543 లోక్ సభ స్థానాలలో అత్యధికంగా ఓటర్లున్న నియోజకవర్గాలు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
దేశంలో అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్ గిరి. దీనిని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ 2019 లెక్కల ప్రకారం 31 లక్షల 50,303 ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడ 15 లక్షల 63063 ఓట్లు పోలయ్యాయి. 2014 లో మాజీ మంత్రి మల్లారెడ్డి విజయం సాధించగా, 2019లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించాడు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయి.
దీని తర్వాత అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఘజియాబాద్. ఇక్కడ 2019 లెక్కప్రకారం 27,28,978 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. 2019 ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సురేష్ బన్సాల్ మీద బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సింగ్ 5 లక్షల ఓట్ల మెజారిటీతో వియం సాధించాడు. ఆ ఎన్నికలలో ఇక్కడ మొత్తం 1524456 ఓట్లు నమోదు అయ్యాయి.
దీని తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం సౌత్ బెంగుళూరు. దీని పరిధిలో గోవింద్‌రాజ్ నగర్, విజయ్ నగర్, చిక్‌పేట్, బసవనగుడి, పద్మనాభనగర్, బీటీఎం లేఅవుట్, జయనగర్, బొమ్మనహల్లి నియోజవర్గాల పరిధిలో 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య 3 లక్షల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి బీకె హరిప్రసాద్ పై విజయం సాధించాడు. గత ఎన్నికలలో అక్కడ 1188491 ఓట్లు పోలయ్యాయి.
ఇక అత్యధిక మంది ఓటర్లు ఉన్న మరో నియోకవర్గం మహారాష్ట్రలోని ముంబయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గం. దీని పరిధిలో గల విలే పార్లే, చండీవాలి, కుర్లా, కాలిన, వాంద్రే తూర్పు, వాండ్రే వెస్ట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుండి 2014, 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ విజయం సాధించారు. గత ఎన్నికలలో 901784 ఓట్లు పోలవ్వగా పూనమ్ లక్ష 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
ముంబయి నార్త్ తర్వాత అత్యధిక మంది ఓటర్లు ఉన్న మరో నియోజకవర్గం నార్త్ ఈస్ట్ ఢిల్లీ. ఇక్కడ దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీద బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ 3.50 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గత ఎన్నికలలో ఇక్కడ 1461475 ఓట్లు పోలయ్యాయి.
దీని తర్వాత ఢిల్లీలోనే ఉన్నమరో నియోజకవర్గం చాందినీ చౌక్ స్థానంలో అత్యధికంగా 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్ మీద 2.29 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. ఇక్కడ మొత్తం 980390 ఓట్లు పోలయ్యాయి.
ఇక దీని తర్వాత మరో కీలక నియోజకవర్గం వాయువ్య ఢిల్లీ. ఒక వైపు పట్టణం, మరో వైపు గ్రామీణ ఓటర్లతో నిండి ఉన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి హన్స్ రాజ్ హన్స్ 5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆప్ అభ్యర్థి గుగాన్ సింగ్ మీద విజయం సాధించాడు.
కేరళ రాజధాని తిరువనంతపురం అత్యధిక ఓటర్లు ఉన్న మరో నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఉంటారు. చైతన్యవంతమైన నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత ఎన్నికలలో ఇక్కడ 1010180 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ బీజేపీ అభ్యర్థి రాజశేఖరన్ పై లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
మహారాష్ట్రలోని పుణె లోక్ సభ స్థానంలో 13 లక్షల మంది పై చిలుకు ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో అక్కడ 1035236 ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి గిరీష్ బాల్ చంద్ర కాంగ్రెస్ అభ్యర్థి 3.30 లక్షల ఓట్లతో విజయం సాధించాడు.
ఇక యూపీ రాజధాని లక్నో లోక్ సభ స్థానంలో అత్యధికంగా 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గత ఎన్నికలలో 1116445 ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎస్పీ అభ్యర్థి శత్రజ్ఞుసిన్హా మీద 3.35 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ స్థానాలలో ఎక్కువ స్థానాలు ఢిల్లీ పరిధిలోనే ఉండడం విశేషం.
This post was last modified on May 12, 2024 3:25 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…