టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న మామ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాదని నంద్యాలలో తన మితృడు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ప్రచారానికి వచ్చాడు.
శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ పదిహేనేళ్లుగా స్నేహితులు. శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదయ్యింది. ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థి అయిన జనసేన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారానికి వెళ్లకుండా నంద్యాలకు వెళ్లడం చర్చానీయాంశం అయింది.
This post was last modified on %s = human-readable time difference 9:36 am
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…