సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న ఈ టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడి ప్రతి సారి గంటల తరబడి వేల వాహనాలు జామ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల పండుగ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా మరోసారి ప్యాక్ అయింది.
ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఆంధ్రా ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓట్లేయడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
టోల్ గేట్ చెల్లింపునకు వాహనాలు బారులు తీరడంతో పంతంగి నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుకుండటంతో హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం రాత్రి నుంచే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.
ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు, జేబీఎస్ బస్టాండ్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. దీంతో పాటు 58 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నది.
This post was last modified on May 11, 2024 10:24 pm
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…
ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…
ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్…
మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…