రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం చేశారు. కూటమి పార్టీలకు జై కొట్టారు. కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కృష్ణం రాజు.. బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు శ్యామలా దేవి కూడా.. ఆ కండువాతోనే కనిపించారు. సో.. దీనిని బట్టి ఆమె.. బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు అయింది. తాజాగా చివరి రోజు ప్రచారంలో భాగంగా శ్యామలాదేవి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడేనికి వచ్చారు. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తరఫున ఆమె ఇంటి నుంచే ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతిలో మగ్గిపోయిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గెలిచినా.. గెలవకపోయినా .. నియోజకవర్గం ప్రజలకు బొలిశెట్టి సేవ చేశారని.. అన్ని విషయాల్లోనూ అండగా ఉన్నారని తెలిపారు. అలాంటి నాయకుడికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.
దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోడీకి అందరూ అండగా ఉండాలని శ్యామలా దేవి పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లలో దేశం ప్రపంచ దేశాల సరసన చేరుతుందని అన్నారు. ఇలా కావాలంటే.. మోడీకి పట్టం కట్టాలని.. కూటమికి ఓటేస్తే.. మోడీని గెలిపించినట్టేనని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోచంద్రబాబును ముక్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఇక, పవన్ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో సంపాయించుకునే అవకాశం వదులుకుని మరీ ప్రజాసేవ కోసం.. పవన్ కల్యాణ్ వచ్చారని.. ఆయనను గెలిపించాలని శ్యామలా దేవి పిలుపునిచ్చారు.
ఓటర్లంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న శ్యామలా దేవి.. బొలిశెట్టిని గెలిపిస్తే.. నియోజకవర్గం అభివృద్ధికి తాను హామీ ఇస్తానని చెప్పారు. కాగా.. వైసీపీపై ఎలాంటి విమర్శలూ చేయకపోవడం.. సీఎం జగన్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కూటమి కే ఓటేయాలని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.
This post was last modified on May 11, 2024 10:15 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…