“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసిన లేఖను పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు.
అమరావతి రాజధాని సహా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 100కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. కానీ, అబద్ధాలు, దుర్మా ర్గాలు, కట్టుకథలు, మోసాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ప్రజలు తమ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్పగిస్తే.. వైసీపీ నాయకులు భస్మాసురులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
ల్యాండ్, శ్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. వ్యవస్థలను చెరబట్టి ప్రశ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కూడా అణగదొక్కారని పేర్కొన్నారు.
ఈ నెల 13న జరిగేఎన్నికల్లో వైసీపీ భస్మాసురులను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలికేలా ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ఓటేయాలని సూచించారు.
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలతో ప్రజల ముందుకు వచ్చిన కూటమిని గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు.
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై కూటమి దగ్గర స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. అందుకే కటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్భయంగా, నిజాయితీగా ఓటేయాలని సూచించారు.
This post was last modified on May 11, 2024 10:12 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…