ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విశాఖను రాజధాని చేస్తామని జగన్ ప్రకటించినా ఇక్కడి ప్రజల్లో వైసీపీపై సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండను ధ్వంసం చేయడం, బీచ్‌పై ఆధిపత్యం, సహజ వనరుల విధ్వంసం తదితర కారణలతో జగన్‌పై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ సారి 15 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ సారి ఈ స్థానాల్లో వైసీపీని దాటి కూటమి అభ్యర్థులు ముందంజలో సాగుతున్నారనే టాక్ ఉంది. ఏజెన్సీలోని రెండు స్థానాల్లోనూ కూటమికే మొగ్గు ఉందని చెబుతున్నారు.
ఇక విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమలో కూటమికి తిరుగులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం, భీమునిపట్నంలోనూ వైసీపీకి ఓట్లు పడవనిదే స్పష్టమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా అక్కడి వెళ్లి ఉంటానని అనుకున్న జగన్ ఆశలు మాత్రం తీరేలా లేవన్నది ఇక్కడ జనాల మాట.
This post was last modified on May 11, 2024 2:20 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…