అక్కడ కేంద్రంలో.. పక్కన తెలంగాణలో కరోనా వ్యాప్తి దిశగా ప్రభుత్వాలు సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వానికి సహకారం అందిస్తుండగా.. తెలంగాణలో అపోజిషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంటుగా ఉంటున్నాయి. ఈ రెండు చోట్లా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కష్ట కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడతాయి. ప్రభుత్వ పెద్దలేమో ప్రతిపక్షం మీద తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తాయి. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి.
తమ ప్రచార పిచ్చితో వైకాపా నాయకులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ తెలుగుదేశం, జనసేన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమే అనిపించేలా అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దాడి మొదలుపెట్టింది.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఏపీలో కరోనాను వ్యాప్తి చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లాగా పని చేస్తున్నారంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించడం గమనార్హం. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయనన్నారు. కొత్త ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేని అనుమానించే పరిస్థితి ఉందని.. ఆ పార్టీ వాళ్లు ఇందుకోసం స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాజ్‌భవన్‌లో కరోనా వ్యాప్తికి చెన్నై నుంచి వచ్చిన కనగరాజే కారణం అనడం సమంజసమా అని మోపిదేవి ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం రాజకీయమేనని.. కిట్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మోపిదేవి స్పష్టం చేశారు.
This post was last modified on April 27, 2020 5:28 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…