ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమికి ఓ ప్రధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీని దెబ్బ కొడుతున్నారు. ఆ ఆయుధం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల ప్రచార చివరి దశలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చట్టంతో భూములన్నీ జగన్ చేతిలోకి వెళ్లిపోతాయని, జనాలకు హక్కు ఉండదని బాబు బలంగా వాదన వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు ఇతర హామీలు, మేనిఫెస్టో ఇలా ఇతర అంశాలన్నింటినీ పక్కనపెట్టి ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే బాబు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అదే మ్యాటర్. భూములన్నింటినీ మింగేసేందుకు చట్టం పేరుతో జగన్ సిద్ధమయ్యారని బాబు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో, పత్రికల్లో ప్రకటనలో ఇదే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో జనాలు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. తమ భూములను ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు మద్దతు తెలిపేదే లేదంటూ తీర్మానిస్తున్నారు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో నెగెటివ్ ఎఫెక్ట్ ఊహించని స్థాయిలో వైసీపీని కమ్మేస్తోంది. అందుకే కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నా జగన్ తప్ప దీని గురించి వైసీపీలో మాట్లాడేవాళ్లే లేకుండా పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూములకు రక్షణ కల్పిస్తామని జగన్ చెబుతున్నారు. ప్రజల భూములు వాళ్ల పేర్లతోనే ఉంటాయని వివరణ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో జీరాక్స్ కాపీలు కాదు ఒరిజినల్ పేపర్సే ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. కానీ మరే వైసీసీ నేత కూడా దీనిపై మాట్లాడటం లేదు. దీంతో జనాలకు క్లారిటీ రావడం లేదనే టాక్ ఉంది. జగన్ ఎంత చెప్పినా జనాలు వినడం లేదని అంటున్నారు.
This post was last modified on May 10, 2024 5:41 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…