Political News

జగన్ వన్ సైడ్ లవ్

కేసులు కావొచ్చు ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడూ ప్ర‌శ్నించ‌ని ఆయ‌న సొంత ప‌నులే చూసుకున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు త‌దిత‌ర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మ‌నే టాక్ ఉంది. అందుకే బీజేపీ ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు మోడీ కొట్టిన దెబ్బ‌కు జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ జ‌త క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కూట‌మి సాగుతోంది. కానీ జ‌గ‌న్ మాత్రం అవ‌స‌ర‌మైతే కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కారుకు మ‌ద్ద‌తునిస్తామ‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. బీజేపీని విమ‌ర్శించి లేనిపోని త‌ల‌నొప్పి తెచ్చుకోవ‌డం ఎందుకు అనే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్నార‌నే చెప్పాలి. కానీ మోడీ మాత్రం టైమ్ చూసి జ‌గ‌న్‌ను టార్గెట్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులు బీజేపీ నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ ఊపిరి తీసుకున్నారు. మొద‌టి ప్ర‌చార స‌భ‌కు హాజ‌రైన‌ప్పుడు కూడా జ‌గ‌న్ గురించి, వైసీపీ ప్ర‌భుత్వం గురించి మోడీ ఎక్కువ‌గా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో బీజేపీతో స‌త్సంబంధాలు బాగానే ఉన్నాయ‌నే భ్ర‌య‌లో వైసీపీ ఉండిపోయింది.

ఇప్పుడు తాజాగా ఏపీలో ప్ర‌చార స‌భ‌ల్లో జ‌గ‌న్‌పై, వైసీపీ ప్ర‌భుత్వంపై మోడీ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్ర‌భుత్వానికి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని అన్నారు. ఏపీలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు ఏర్పాటు ఖాయ‌మ‌న్నారు. రాయ‌ల‌సీమ చాలా మంది ముఖ్య‌మంత్రుల‌ను ఇచ్చింద‌ని, కానీ ఎవ‌రూ స‌రైన న్యాయం చేయ‌లేద‌ని మోడీ అన్నారు. మాఫియా కోస‌మే వైసీపీ ప‌నిచేస్తుంద‌ని విమ‌ర్శించారు. దీంతో జ‌గ‌న్‌కు గ‌ట్టి దెబ్బ ప‌డింద‌ని అంటున్నారు. ఇప్పుడు మోడీ, బీజేపీపై విమ‌ర్శ‌లు చేసేంత ధైర్యం జ‌గ‌న్‌కు కానీ వైసీపీకి కానీ లేవు. మ‌రోవైపు మోడీ ప్ర‌చార స‌భ‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌రికొత్త ఉత్సాహంతో స‌మ‌రానికి సై అంటున్నారు.

This post was last modified on May 10, 2024 8:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

2 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago