ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సహా ఆసరా, చేయూత, విద్యా దీవెన పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నగదును పోలింగ్‌కు ముం దు ఇచ్చేందుకు వీలు కాదని తేల్చి చెప్పింది. పోలింగ్ మరో నాలుగు రోజుల్లో జరగనుందని.. పోలింగ్ ముగిసిన తర్వాత.. ప్రజలకు ఆయా పథకాల నిధులను జమ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర హైకోర్టుకు పేర్కొంది.
రాష్ట్రంలో పథకాలకు సంబంధించిన లబ్ది దారుల సొమ్మును జమ చేయాల్సి ఉందని.. అయితే.. ఎన్నిక ల సంఘం ఆయా నిధులను నిలిపివేయాలని ఆదేశించిందని.. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సహా ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఆయా నిధులు విడుదల చేయకపోతే.. రైతులు, విద్యార్థులు నష్టపోతారని కూడా వివరించింది.
పైగా ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలేనని.. కొత్తగా తీసుకువచ్చినవికాదని కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగాకొత్తగా లబ్ధి దారులను కూడా చేర్చలేదని.. పాతవారికే ఈ పథకాలు అందిస్తున్నామని కాబట్టి.. నిధులు జమ చేసేందుకు అనుమతి ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థిం చింది. దీనిపై గత మూడు రోజలుగా విచారణ జరిగింది. తాజాగా గురువారం ఈసీ మరోసారి తన నిర్ణయా న్ని కోర్టుకు వెల్లడించింది.
ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పీక్ స్టేజ్‌కు చేరుకుందని.. పోలింగ్ ముగిసిన తర్వాత.. జమ చేసుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది. ముందుగానే జమ చేయడం ద్వారా.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ట్టు అవుతుందని.. ఇది కోడ్‌కు కూడా విరుద్ధమని తెలిపింది. ఆయా నిధులకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడో బటన్ నొక్కారని.. కానీ, నిధులు జమ కాకుండా నిలువరించినట్టు స్పష్టమవుతోందని తెలిపింది. ఎన్నికలకు ముందు వీటిని విడుదల చేయాలన్న ఉద్దేశం ఉందని.. కాబట్టి.. పోలింగ్ ముగిసిప 13 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిధులు జమ చేయొచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.
This post was last modified on May 9, 2024 2:58 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…