‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు, మీ ప్రస్తుత భార్యకు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడి టికెట్లు ఇప్పిస్తాను. మీకు ఇష్టమైతే నేను సిద్దం’ అని కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ముద్రగడ కూతురు క్రాంతి పిఠాపురంలో పవన్ కు మద్దతు తెలిపిన నేపథ్యంలో పవన్ ఆమెకు భవిష్యత్తులో జనసేన టికెట్ ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో కౌంటర్ గా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
పవన్ కల్యాణ్ మా తాత కాపు, మా నాయనమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడలు కాపు… మేం స్వచ్ఛమైన కాపులం, మేం నికార్సయిన కాపులం. మీరు కూడా స్వచ్ఛమైన కాపులు చరిత్ర బయటపెట్టండి.
మీ అమ్మ గారి చరిత్ర, మీ నాన్న గారి చరిత్ర, మీరు పుట్టిన ఊరు, మీ తాత గారి ఊరు, మీ అమ్మ గారి ఊరు. అన్నీ కూడా బయటపెట్టండి. నికార్సయిన కాపు మీరా ? నేనా ?లోకానికి తెలియాలి. వంగా గీత కాపు కాదా? ఆమె పోటీ చేయకూడదా? అని ముద్రగడ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడుతూ… సినిమాల్లో నటనను ఇక్కడ చూపిస్తుంటే మేం వెర్రి వెధవల్లా నీకు జై కొట్టాలా అని ముద్రగడ దుయ్యబట్టారు. ఎవరు అసలు కాపు ? ఎవరు కల్తీ కాపు ప్రజలకు తెలియాలి అని ముద్రగడ అనడం గమనార్హం. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సెగలు రేపుతున్న వేళ ముద్రగడ వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి.
This post was last modified on May 8, 2024 9:22 pm
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…