కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే.. ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత.. ఏ క్షణమైనా ఊరు దాటి.. దేశం దాటి.. పోయేందుకు పాస్టు పోర్టును రెడీ చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న షర్మిల.. స్థానిక మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిలను ఆమె టార్గెట్ చేసుకున్నారు.
“ఇక్కడ ప్రజల నాడి చూస్తే.. అందరూ వివేకా హత్యపై సానుబూతితో ఉన్నారు. ఆయనకు న్యాయం జర గాలంటే.. ఓటు వేసి షర్మిలను గెలిపించాలని నిర్ణయించుకున్నట్టు నాకు అర్థమవుతోంది” అని షర్మిల అన్నారు. ఒక ప్రభంజనమైతే కడపలో కనిపిస్తుందన్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పా రు. ఓడిపోయిన వెంటనే.. అవినాష్‌ను అరెస్టు చేయడం తథ్యమని తెలిపారు. ఒకవైపు.. ఓడిపోతాననే భయం.. మరోవైపు, అరెస్టు భయం రెండూ ఆయనను వెంటాడుతున్నాయన్నారు.
అందుకే పాసుపోర్టును రెడీ చేసుకుని పెట్టుకున్నాడని షర్మిల విమర్శలు గుప్పించారు. ఒకవేళ అవినాష్ రెడ్డే కనుక గెలిస్తే.. నేరం గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. తామే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలనేది వైఎస్ భారతి ప్లాన్‌గా ఉందని అన్నారు. “అదే నిజమైతే.. మిగతా వాళ్లను కూడా.. గొడ్డలితో నరికేయండి. అప్పు డు మీరే సింగిల్ ప్లేయర్ ” అని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన జరగడం లేదని.. షర్మిల వ్యాఖ్యానించారు. అందుకే వైఎస్ వారసురాలిని తానేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
This post was last modified on May 8, 2024 3:44 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…