Political News

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తావించ‌డానికి వీల్లేద‌ని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చేతులు కాళ్లు క‌ట్టేసి న‌ట్టు అయింది. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌స్తావించ‌రాద‌ని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం పెట్టుకున్న అర్జీని బుట్ట‌దాఖ‌లు చేసింది.

ఏం జ‌రిగింది?

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను 2019 నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటిలో కాలానుగుణంగా అమ‌లు చేసే కార్య‌క్ర‌మం వైఎస్సార్ రైతు భ‌రోసా, అమ్మ ఒడి వంటివి. మే మొద‌టి లేదా రెండో వారంలో రైతులు దుక్కుతున్నారు కాబ‌ట్టి వారికి పెట్టుబ‌డి సాయం కింద జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.6000 ఇస్తోంది. న‌వంబ‌రు నాటికి మ‌రో రూ.7300 ఇస్తోంది. దీనిలో కేంద్ర సాయం 2000 చొప్పున ఉంటుంది. ఇప్పుడుమే రెండో వారం ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ కింద‌.. సాయం చేయాల‌ని ప్ర‌భుత్వం చూసింది. అయితే.. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ.. ఇప్ప‌టికే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ప‌థ‌కాల పేరుతో జ‌గ‌న్‌ మోసం చేస్తున్నారంటూ లేఖ రాసింది.

ఇది జ‌రిగిన రెండు రోజుల‌కు క‌ళ్లు తెరిచిన ప్ర‌బుత్వం రైతుల‌కు ఏటా ఇస్తున్న‌ట్టుగానే ఇప్పుడు కూడా ఇన్ పుట్ సాయం కింద రూ.6000 ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. అయితే.. అప్ప‌టికే టీడీపీ ఇచ్చిన లేఖ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఈసీ..ఏ ప‌థ‌కానికీ నిధులు విడుద‌ల చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ మ‌రో లేఖ రాసింది. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న ప‌థ‌కమ‌ని.. గ‌త నాలుగేళ్లుగా అమ‌ల్లోఉంద‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ.. ఇవ్వ‌డానికి వీల్లేద‌ని.. ఈసీ ష‌ర‌తులు విధించింది.

అంతేకాదు.. ఈ విష‌యాన్ని ప్ర‌చారంలో వాడుకోవ‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో త్వ‌ర‌లో ఇవ్వ‌ల్సిన అంటే.. జూన్ 1, 2 తారీకుల్లో ఇవ్వాల్సిన అమ్మ ఒడికి కూడా.. ఈసీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. ప‌సుపు-కుంకుమ ప‌థ‌కానికి ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు హైకోర్టుకు వెళ్లి అనుమ‌తి తెచ్చుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు కూడా అలా చేస్తుందా ? లేదా.. అనేది చూడాలి.

This post was last modified on May 7, 2024 10:43 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago