ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ అధికారంలోకి వరుసగా మూడోసారి రానుందని తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు. అనకాపల్లి బెల్లం అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. అలాంటి తీయటి ప్రభుత్వమే ఏపీలో ఏర్పడనుందని చెప్పారు. జూన్ 4న వచ్చే ఫలితాలు.. ఇంత కన్నా తియ్యగా ఉంటాయని, ఏపీలో కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని మోడీ తెలిపారు.
విశాఖ రైల్వేజోన్ ఇచ్చేందుకు తాము రెడీగానే ఉన్నామని..కానీ.. ఇక్కడి ప్రభుత్వమే భూమి ఇవ్వడం లేదని మోడీ విమర్శించారు. ఏపీలో 9 వేల కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఐఐటీ, ఎయిమ్స్ వంటివి ఇచ్చామని తెలిపారు. వికసిత్ ఏపీ, వికసిత భారత్ కోసం.. మే 13న ఓటేయాలని.. ఎన్డీయే కూటమిని గెలిపించాలని మోడీ కోరారు. ఏపీలో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో దేశ ఖ్యాతి పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. కేంద్రం ఏపీలో ఎంతో అభివృద్ది చేస్తుంటే.. ఇక్కడున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రధాని ప్రశ్నించారు.
“నా పనితీరు చూసి దేశ ప్రజలు ఓటేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగింది” అని మోడీ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. “పోలవరం ప్రాజెక్టుకు ఏపీకి జీవనాడి వంటిది. దీనిని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారం భించారు. తండ్రివారసత్వంగా వచ్చి.. రాజకీయాలు చేస్తున్న జగన్.. తండ్రి కలలు కన్న ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేక పోయారు. కానీ, కేంద్ర ఈ ప్రాజెక్టుకు రూ.15000 కోట్లు ఇచ్చింది. మరి ఆ నిధులు ఏం చేశారు? రైతుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదు” అని విమర్శించారు.
వైసీపీ మంత్రం.. ‘అవినీతి-అవినీతి-అవినీతి’ అని మోడీ విమర్శించారు. కేంద్రం చేపట్టిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు కుందని చెప్పారు. కానీ, ఎన్డీయే మంత్రం మాత్రం..’అభివృద్ధి-అభివృద్ధి-అభివృద్ధి’ అని మోడీ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రబుత్వ నిర్వాకంతో అనకాపల్లి రైతులు చెరుకు పండించడం మానేశారని చెప్పారు. దీంతో పరిశ్రమలు మూతబడుతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. “వైసీపీ,కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. మాఫియా రాజ్. ఏపీలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా కొనసాగుతున్నాయి” అని మోడీ దుయ్యబట్టారు.
This post was last modified on May 6, 2024 6:32 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…