ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అంబటి అంత నీచ నికృష్టుడు ఇంకొకరు ఉండరని.. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరిస్తూ గౌతమ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సొంత అల్లుడే అంబటి మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అంబటి వ్యక్తిత్వం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
దీనిపై అంబటి రియాక్షన్ ఏంటా అని అందరూ ఎదురు చూశారు. ఈ రోజు ఆయన అల్లుడి వీడియో మీద స్పందించారు. తన అల్లుడి వీడియో వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని.. ఆయనే గౌతమ్‌ను రెచ్చగొట్టి ఇలా తన మీద వీడియో చేసేలా చేశారని అంబటి ఆరోపించారు.
తన రెండో కూతురు డాక్టర్ మనోజ్ఞకు, అల్లుడు డాక్టర్ గౌతమ్‌కు నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నట్లు అంబటి రాంబాబు వెల్లడించారు. రెండేళ్లుగా తన ఇద్దరు బిడ్డలతో కలిసి మనోజ్ఞ తన సంరక్షణలోనే ఉంటున్నారని.. వారికి అల్లుడి నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అంబటి తెలిపారు.
తాను తన అల్లుడి వ్యాఖ్యల గురించి స్పందించేవాడిని కాదని.. కానీ సొంత అల్లుడే తనకు ఓటు వేయొద్దని చెబుతున్నాడని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడంతో మాట్లాడక తప్పట్లేదని అంబటి చెప్పారు.
ఎవరి కుటుంబంలో విభేదాలు లేవని.. ప్రతి కుటుంబంలో ఇలాంటివి ఉంటాయని అంబటి వ్యాఖ్యానించారు. తనకు విడాకులు ఇవ్వాలని గౌతమ్ బెదిరిస్తున్నాడని.. కూతురితో పాటు పిల్లల భవిష్యత్తు కోసం తాను పోరాడుతున్నానని అంబటి తెలిపారు.
This post was last modified on May 6, 2024 3:52 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…