ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్‌లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద ఎత్తున ప్రచారంలో దూకుడుగా ఉన్నాయి. పార్టీల అధినేత నుంచి నాయకుల వరకు కూడా.. అందరూ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయా నాయకుల కుటుంబాల్లోని పిల్లలు కూడా.. తెరమీదికి వస్తు న్నారు. చిత్రం ఏంటంటే.. తమ వారికి అనుకూలంగా ఓటేయాలని చెప్పాల్సిన ఈ పిల్లలు.. యాంటీ ప్రచారం చేస్తున్నారు.
రెండు రోజుల కిందట.. కాపు ఉద్యమనాయకుడు.. ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె.. క్రాంతి భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ను తన తండ్రి తిట్టడాన్ని ఆమె తప్పు బట్టారు. అంతేకాదు.. తాను పవన్‌తో నడుస్తాననిచెప్పారు. తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారని కూడా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒకవైపు.. చర్చ సాగుతుండగానే.. తాజాగా మరో సంచలనం తెరమీదికి వచ్చింది. అదే.. వైసీపీ కీలక నేత.. సంబరాల రాంబాబుగా పేరు తెచ్చుకున్న మంత్రి అంబటి రాంబాబు అల్లుడి సెల్ఫీ వీడియో.
మంత్రి అంబటి రాంబాబుకు ముగ్గురూ ఆడపిల్లలే. వీరిలో ఒకరి భర్త డాక్టర్ గౌత్. ఈయన తాజాగా సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిలో ఆయన తన సొంత మామ అంబటిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నేనుఅంబటి రాంబాబు అల్లుడిని అది నా దురదృష్టం. ఎవరూ ఏం చేయలేరు” అంటూ… ప్రారంభించిన ఆయన.. తన మామ అత్యంత నీచ,నికృష్ట దరిద్రుడని అన్నారు. “అంబటి రాంబాబు వంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేద”న్నారు
“నేనూ రోజూ ఉదయాన్నే దేవుడికి దణ్ణం పెట్టుకునేప్పుడు.. ఇంత నీచుడిని నా జీవితంలో ఇంకెప్పుడూ.. ఇంట్రడ్యూస్ చేయకు స్వామీ అని దేవుడిని వేడుకుంటా. అంత నీచకృష్ట వ్యక్తి. కనీసం విలువలు, బాధ్య త.. ఏమాత్రం లేని వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఓటేసే ముందు ఆలోచించుకోవా లని సూచించారు. ఓటేస్తే.. ఎంత లేకిపనైనా చేసి బతకొచ్చనే వారిని ప్రోత్సహిస్తున్నట్టు అన్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే.. రేపు భవిష్యత్తు కూడా.. ఇలానే మారుతుందన్నారు. సరైన వ్యక్తిని ఎంచుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మరి దీనిపై అంబటి ఏమంటారో చూడాలి.
This post was last modified on May 5, 2024 1:05 pm
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు…
స్టార్ బక్స్... ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు పటాపంచలు అవుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ…
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ పగ్గాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీ అధినే త కేసీఆర్…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని…