సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్ గురించి కొందరు చెబుతుంటారు. రవిప్రకాష్ అనే పేరు కంటే, టీవీ9 రవిప్రకాష్ అంటేనే, ఇంకా బాగా గుర్తుపడతారు.
కానీ, టీవీ9 రవిప్రకాష్ అనే గుర్తింపుకి ఏనాడో కాలం చెల్లింది. ఆయనిప్పుడు టీవీ9తో లేరు. ‘ఆర్‌టీవీ’ ద్వారా జనం ముందుకొచ్చారు రవిప్రకాష్. బ్లాక్‌మెయిల్ జర్నలిజం అనీ, ఇంకోటనీ రవిప్రకాష్ మీద వున్న ఆరోపణలు.. అదంతా వేరే చర్చ. సరిగ్గా, 2024 ఎన్నికలకు ముందు, మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో రవిప్రకాష్ పేరు మార్మోగిపోతోంది.
మరీ ముఖ్యంగా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రవిప్రకాష్ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి, ఎన్నికల గురించీ.. రవిప్రకాష్ తన ట్రేడ్ మార్క్ సర్వేలతో హల్‌చల్ చేసేస్తున్నారు. ‘ఈయనింకా మీడియా రంగంలోనే వున్నారా.?’ అని కొందరు ఆశ్చర్యపోవచ్చుగాక.!
కానీ, రాత్రికి రాత్రి, రవిప్రకాష్ సర్వే ఫలితాలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సెన్సేషన్ అవుతున్నాయి. దాదాపుగా 110 సీట్లు టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి దక్కుతాయన్ని రవిప్రకాష్ వెల్లడించిన, ‘ఆర్టీవీ’ సర్వే సారాంశం. ఏయే జిల్లాల్లో ఏయే పార్టీకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్నది సవివరంగా రవిప్రకాష్ పేర్కొన్నారు.
అయితే, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. ఎన్నికల సమయంలో చాలా సర్వేలు వస్తుంటాయి. వీటిల్లో చాలావరకు పెయిడ్ సర్వేలే.! అంతిమంగా ఓటరు తీర్పు ఏంటన్నది, పోలింగ్ రోజున ఈవీఎంలలో నిక్షిప్తమవుతుంది.
ఇంతకీ, రవిప్రకాష్ సర్వేలో నిజమెంత.? ప్రస్తుతం వున్న పొలిటికల్ ఈక్వేషన్‌కి అనుగుణంగా చూస్తే, ఈ సర్వే చాలావరకు నిజమేననిపించకమానదు. కాకపోతే, రవిప్రకాష్ చెప్పినదానికంటే ఎక్కువ సీట్లు టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి వస్తాయన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on May 5, 2024 12:41 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…