గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ ప్రయోజనం ఉండటం లేదనే టాక్ ఉంది. అందుకే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకునేందుకు నాని సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారంటూ ఆత్మీయ సమావేశానికి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నేతలు, పార్టీని కాపాడుకోవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు. టీడీపీ సోషల్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారని నాని ఆరోపించారు.
జూనియర్ ఎన్టీఆర్ జెండా పట్టుకునే అభిమానులపై టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తున్నారని నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై దాడి చేయొద్దని టీడీపీ కార్యకర్తలకు బాబు, లోకేశ్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. పార్టీని ఎన్టీఆర్ నడిపించినప్పుడే ఆయన అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తనకు రెండు కళ్లని కూడా నాని చెప్పడం గమనార్హం. తన కారుకు ఈ ఇద్దరి ఫోటోలు పెట్టుకుని ధైర్యంగా తిరుగుతానన్నారు. ఇలా ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును ట్రబుల్‌లో నెట్టేందుకు నాని ప్రయత్నించడం హాట్ టాపిక్‌గా మారింది. కూటమి విజయాన్ని ఆపేందుకే ఎన్టీఆర్ అభిమానులను తనవైపు తిప్పుకునేందుకు నాని వేసిన ప్లాన్ ఇదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 4, 2024 2:47 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…