Political News

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గ‌తంలో ఒక‌సారి త‌ప్పిపోయిన ఎమ్మెల్సీ సీటు ఈ ద‌ఫా ద‌క్కింది. దీంతో తాజాగా ఆయ‌న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. దీనికి ముందు తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కుటుంబానికి , త‌న‌కు ఉన్న ఆస్తుల‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న తన కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ స‌ర్కారు పేరుతో బాండు రాసిచ్చారు. బాండులో పేర్కొన్న లెక్క‌ల ప్ర‌కారం తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కోటీ 50 ల‌క్ష‌ల మేర‌కు ఆస్తులు ఉన్నాయి. వీటిని తాను ప్ర‌భుత్వానికి ఇస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. గ‌తంలో తాను మాట ఇచ్చాన‌ని.. తాను ప్ర‌జాప్ర‌తినిధిగా పోటీ చేయాల్సి వ‌స్తే.. ఆస్తులు ప్ర‌భుత్వ ప‌రం చేస్తాన‌న్నాన‌ని.. ఇప్పుడు అదే ప‌నిచేస్తున్నాన‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌క‌టించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా తొలిసారి తీన్మార్ మ‌ల్ల‌న్న శాస‌న మండ‌లికి పోటీ చేస్తున్నారు.

ఇదిలావుంటే.. త‌న సునిశిత విశ్లేష‌ణ‌.. విమ‌ర్శ‌ల‌తో నిరంత‌రం మీడియాలో ఉన్న మ‌ల్ల‌న్న ప్ర‌భుత్వ తీరును తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టేవారు. ఒక ద‌శ‌లో కేసులు కూడా ఎదుర్కొని జైలుకు వెళ్లారు. అయినా..ఎక్క‌డా వెనుదిరిగి చూడ‌లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టికెట్ ఆశించారు. కానీ, చివ‌రి నిముషంలో త‌ప్పిపోయింది. త‌ర్వాత‌.. సీఎం రేవంత్‌రెడ్డి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించినా.. అక్క‌డ కూడా ఇబ్బంది ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌వీన్‌కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ఆఫ‌ర్ చేశారు. స్థానికంగా బ‌లం ఉండ‌డం, గ్రాడ్యుయేట్ల ఫాలోయింగ్ ఉండ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం మెండుగా ఉంది.

This post was last modified on May 4, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

50 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

51 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago