భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నది. అయితే తొలి, మలి దశ పోలింగ్ అనంతరం బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఆశాజనకంగా లేవని ఆ పార్టీ నేతల మారిన స్వరాలు స్పష్టం చేస్తున్నాయి. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హిందూ – ముస్లిం విభజన, రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శలు వస్తున్నాయి.
ఉత్తరాదిన అనుకున్న స్థానాలు వస్తాయన్న నమ్మకం లేకపోవడం, కర్ణాటకలో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ ఉదంతం నేపథ్యంలో బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకే మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు.
అయితే తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తనను గెలిపిస్తే కేంద్ర మంత్రి అయిపోతామని ఎవరికివారు ప్రచారం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. 2014లో తెలంగాణ నుండి బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోనే తొలగించారు. 2019 ఎన్నికల తరువాత ఏపీ, తెలంగాణ నుండి కలిపి ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఖాయం భారీగా ప్రచారం జరిగినా అలాంటి అద్భుతాలు ఏం జరగలేదు.
ఇక ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నుండి పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, మాధవీలత, రఘునందన్‌రావు తదితరులు అందరూ తమను గెలిపిస్తే కేంద్రంలో మంత్రులం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ నుండే ఇంత మంది కేంద్రమంత్రులు అయితే మిగతా రాష్ట్రాలలో గెలిచిన వారికి ఏమిస్తారని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on May 4, 2024 10:39 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…