చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక వ్యక్తి పోటీచేస్తున్నాడు. ఈ కొండాకు ఆ కొండా ఇప్పుడు కంట్లో నలుసులా మారాడు. డమ్మా ఈవీఎంలతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 వ నంబరులో ఉన్న కొండాకు బదులు 5వ నంబరులో ఉన్న కొండా గుర్తును చూయిస్తుండడం ఈయన ఆందోళనకు కారణం.
దీంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి తన గోడును కోర్టుకు వెళ్లబోసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తమ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని కోరారు.
ఈవీఎంలో తన గుర్తు నెంబర్ 2 లో ఉన్నందున, తన పేరుతో ఉన్న మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటీషన్‌లో అభ్యర్థించారు. ప్రస్తుతం ఈవీఎంలు కూడా సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కేటాయించిన దశలో వరుస సంఖ్యలు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. మరి కొండా ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి.
This post was last modified on May 3, 2024 9:15 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…