జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై విమర్శలు గుప్పించేవాళ్లు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాటలతో చెలరేగిన రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అనే అంశంపై కేసీఆర్ సైలెంట్‌గా ఉండటం, బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తన తనయ కవిత బెయిల్ కోసమే కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై పెద్ద రగడే కొనసాగుతోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ సారి 400 సీట్లు గెలవాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకోవడానికి కూడా కారణం అదేనని విమర్శిస్తోంది. ఎక్కువ మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేయొచ్చని బీజేపీ కుట్ర పన్నుతోందని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయని చెబుతోంది.
ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. కానీ తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందనే స్థితిలో కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా మాట్లాడే ఆయన.. ఇప్పుడు రిజర్వేషన్లపై మాత్రం మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోంది. కవిత బెయిల్ కోసం ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. అందుకే బీజేపీ విషయంలో కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదైనా గట్టిగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ నెమ్మదించారని తెలిసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. అప్పుడే దీనిపై విమర్శలొచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడినా ఇబ్బందేనని కేసీఆర్ కాంప్రమైజ్ అయినట్లు సమాచారం.
This post was last modified on May 3, 2024 5:58 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…