Political News

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్ బ్లేడ్ మాత్రమే. ఇన్నేండ్ల అతని నటన, నిర్మాత ఇచ్చిన గుర్తింపుకన్నా ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే గొంతుకోసుకుంటాను అన్న సవాల్ బాగా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత ఆ సవాల్ ను ఆయన దాట వేయడం తర్వాతి విషయం.

ఆ తర్వాత బండ్ల గణేష్ అనేకమార్లు కేసీఆర్ పాలన మీద ప్రశంసలు కురిపించాడు. ఇక 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, వీ6 అధినేత, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ సంధర్బంగా గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘’నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిన. కాంగ్రెస్ పార్టీలోనే చస్తా.  తెలంగాణలో పద్నాలుగు లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ గెలవాలి. నేను మంథనికి వచ్చిప్పుడు కొందరిని ఎవరికి ఓటు వేస్తావని అడిగితే. మేం హిందువులం.బీజేపీకి ఓటేస్తామని కొందరు చెప్పారు. వారికి అసలైన హిందుత్వ పార్టీ కాంగ్రెస్ అని వారికి చెప్పాను’’ అని బండ్ల గణేష్ అన్నాడు.

‘నాకు 50 ఏళ్లు. ఇప్పటికి 34 ఏళ్లు శబరిమలై వెళ్లి వచ్చాను. నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు. మీరు శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు. కానీ నేను బతికేదే శ్రీరాముడిని నమ్ముకొని. మేం నమ్ముతున్నది ఆంజనేయుడిని. మేం ఉదయం నిద్రలేస్తే దేవుళ్లను తలుచుకుంటాం. ముస్లిం, క్రైస్తవులను గౌరవిస్తాం.. మా కంటే హిందువులు ఎవరూ లేరు’ అని వారికి సమాధానం ఇచ్చినట్లు గణేష్ వెళ్లడించాడు. తరచుగా మీడియా ఇంటర్వ్యూలతో వార్తల్లో ఉండే బండ్ల గణేష్ తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారానికి కూడా దిగాడు. గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం అని అంటున్నాడు. మరి గణేష్ కష్టం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

This post was last modified on May 3, 2024 9:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

15 mins ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

6 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

9 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

10 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

10 hours ago