Political News

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారంలో దూసుకు పోతున్నారు. రోజుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రో 10 రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో మ‌రింత దూకుడు పెంచ‌నున్నారు. అయితే.. మ‌రోప‌క్క రాష్ట్రంలో ఎండ‌లు ఠారెత్తుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉష్నోగ్ర‌త‌లు 45- 47 డిగ్రీల వ‌ర‌కు కొన‌సాగుతున్నాయి.

దీంతో సాధార‌ణంగా ఉద‌యం 9 గంట‌ల‌కే బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాగ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారం మానేస్తే.. వెనుక‌బ‌డి పోతార‌నేది నాయ‌కుల భ‌యం. ఈ క్ర‌మంలో కొంద‌రు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మ‌రికొంద‌రు తెగించి ప్ర‌చారం చేస్తున్నారు. ఇంకోంద‌రు.. సాయంత్ర 4 గంట‌ల త‌ర్వాత‌.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌చారం చేస్తున్నారు. చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. ఎండలు సైతం లెక్క చేయ‌కుండా.. ఆయ‌న ప్ర‌చారంలో దూసుకు పోతున్నారు. అయితే.. వ‌య‌సు రీత్యా ఆయ‌న కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా చంద్ర‌బాబు గ‌త రెండు రోజుల నుంచి ప్ర‌త్యేక మైన టోపీ ధ‌రిస్తున్నారు.

ఎక్క‌డికి వెళ్లినా.. ఆయ‌న ఈ టోపీతోనే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ముఖ్యంగా ఎండ వేళ‌ల్లో ఈ టోపీని పెట్టుకునే బ‌య‌ట‌కు వ‌స్తున్నా రు. ప్ర‌చార స‌భ‌ల్లోనూ ఈ టోపీతోనే క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు పెట్టుకుంటున్న ఈ టోపీ గురించి సోష‌ల్ మీడియాలోనే కాకుండా.. టీడీపీ నేత‌ల మ‌ధ్య కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఈ టోపీ విష‌యానికి వ‌స్తే.. ఇది కూలింగ్ టోపీ. దీనిని బ్రిట‌న్ నుంచి రెండు రోజుల కింద‌టే తెప్పించార‌ని స‌మాచారం. దీనిని ప్ర‌త్యేక‌మైన ఊలుతో త‌యారు చేస్తారు. ఎంత ఎండ ఉన్న‌ప్ప‌టికీ… ఇది వేడిని త‌ల‌కు త‌గ‌ల‌కుండా కాపాడుతుంది. సుమారు 8 వేల రూపాయ‌ల‌ని తెలిసింది. దీని నుంచి ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని.. అందుకే.. చంద్ర‌బాబు దీనిని ధ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి ఎంత ఎండ ఉన్నా…. ప్ర‌చారం త‌ప్ప‌క పోవ‌డంతో చంద్ర‌బాబు ఈ టోపీ పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on May 3, 2024 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జాంబీ రెడ్డి 2 కోసం వంద కోట్ల బడ్జెట్ ?

దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…

2 hours ago

సార్ దర్శకుడికి సూపర్ ఆఫర్స్

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…

2 hours ago

విచార‌ణ‌కు రండి..: సాయిరెడ్డికి నోటీసులు

"విచార‌ణ‌కు రండి. ఈ నెల 18న హాజ‌రై మాకు స‌హ‌క‌రించండి. వ‌చ్చేప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఆధారాలు వివ‌రాలు కూడా…

3 hours ago

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…

3 hours ago

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ…

4 hours ago

పవన్ కమిట్మెంట్స్ ఇవే….మిగిలినవి ఉత్తివే

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…

4 hours ago