ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని సహిస్తున్నామని.. లేకపోతే.. ప్రతిపక్ష నేతలను బొక్కలో వేసేవారమని అన్నారు. అయితే.. అది బొత్సకు కలిగిన బాధ వల్ల అన్నారో.. లేక ఎన్నికల భయం వల్ల అన్నారో తెలియదు. మొత్తానికి వివాదాస్పద వ్యాఖ్యలైతే చేసేశారు. దీనిపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇది ఎటు దారితీస్తుందో బొత్స చిక్కుల్లో పడతారో లేదో చూడాలి.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజకీయ మంటలు రగులుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఈ యాక్టును తీసుకువచ్చి.. ప్రజల ఆస్తులు దోచుకుంటోందని.. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని.. గత నాలుగు రోజులుగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రచారంలో చెబుతున్నారు. దీనిని భారీ ఎత్తున ప్రొజెక్టు చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ మరో అడుగు ముందుకు వేసి “జగన్ దోచుకునే చట్టం“ ఇదే నని చెబుతున్నారు ఇక, చంద్రబాబు కూడా ఎక్కడ సభ పెట్టినా.. ఇదే చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయంగా ఈ వ్యతిరేక ప్రచారం తీవ్రస్థాయిలో ఉండడంతోపాటు.. ప్రధాన మీడియా కూడాదీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ఇప్పటికే సీఎం జగన్ బుధవారం వివరణ ఇచ్చారు. దీనిని ప్రజల రక్షణ కోసం తెచ్చామన్నారు. వారి ఆస్తులకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే 100 ఏళ్ల కిందటి రికార్డులను తాజా పరుస్తున్నామని.. దీనిలో కుట్రలేవని వివరణ ఇచ్చారు. అయినా.. కూడా ప్రతిపక్షాలు వినిపించుకోవడం లేదు. ఇక, వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టమేనని అన్నారు.
అయినా.. ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. దీంతో ఏమనుకున్నారో.. ఏమో మంత్రి బొత్స మీడియా ముందుకు వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని.. దీనిని ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండి కాబట్టి వదిలేశామని.. లేకపోతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నవారిని అరెస్టు చేసి బొక్కలో వేసేవారమని చెప్పారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
This post was last modified on May 3, 2024 8:45 am
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…