‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆయన నా మీద ఎప్పటికీ అదే అభిమానం చూపిస్తారు..’ అంటూ వైసీపీ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మనోగతం ఏంటి.? అసలు చిరంజీవి అభిమానులు ఏమనుకుంటున్నారు.?
చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వేర్వేరు కాదు.! కాకపోతే, చిరంజీవి అభిమానులనే ముసుగేసుకుని, కొందరు పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా, సినిమాల పరంగా విమర్శలు చేస్తుంటారు. ఇదో రాజకీయ యెత్తుగడ. వైసీపీ అమలు చేస్తున్న రాజకీయ యెత్తుగడ అనడం సబబేమో.
వంగా గీత విషయమై మెగాస్టార్ చిరంజీవికి, ప్రత్యేకమైన అభిమానం వుంటుందా.? అంటే, చిరంజీవి రాజకీయాల్లో లేరు. రాజకీయంగా చిరంజీవి ఎవరికైనా మద్దతివ్వాల్సి వస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ కోణంలోనే వుంటుంది.
‘తమ్ముడికి నా నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని అన్నగా నాకూ వుంటుంది కదా. నా పేరు చెప్పుకుని, రాజకీయాల్లో పాపులారిటీ పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు. దాన్ని నేను పట్టించుకోను..’ అంటూ చిరంజీవి తాజాగా, తనకు అత్యంత సన్నహితులైన కొందరు వ్యక్తుల వద్ద వ్యాఖ్యానించారట.
ఇక, పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ పిలిస్తే, వెళ్ళడానికి చిరంజీవి సిద్ధంగానే వున్నారు. అయితే, రాజకీయ విమర్శలకు చిరంజీవిని దూరంగా వుంచాలన్న కోణంలో, ప్రచారానికి పవన్ కళ్యాణే పిలవడంలేదట.
వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కదా.? అంటే, వాళ్ళు వేరు.. చిరంజీవి వస్తే, ఆ లెక్క వేరు.! సరైన సమయంలో చిరంజీవిని రప్పించాల్సి వస్తే, రప్పించాలన్న ఆలోచన జనసేనలో వుంది. పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేయడమే ఆలస్యం.! వంగా గీత విషయానికొస్తే, పవన్ కళ్యాణ్‌ని గెలిపించండని చిరంజీవి పిలుపునిస్తే, దానర్థం వంగా గీతను ఓడించమనే కదా.?
This post was last modified on May 2, 2024 7:31 am
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…