వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “నవరత్నాలు సరే.. ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా” అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్నిఅందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే.. వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో ప్రజల్లో నవరత్నాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే.. దీనినే కార్నర్ చేస్తూ.. షర్మిల ఇప్పుడు.. నవసందేహాల పేరుతో బహిరంగ లేఖ రాశారు. వీటికి సమాధానం చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా.. నవసందే హాలు తీసుకురావడం.. సమాధానం చెప్పాలని కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో షర్మిల చాలా వ్యూహాత్మకంగా.. రాజకీయ అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇవీ.. షర్మిల సంధించిన నవ సందేహాలు!
1) ఎస్సీ, ఎస్టీ రైతులకు వైఎస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు. వాటిని ఎందుకు ఆపేశారు?
2) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం నిజం కాదా?
3) గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీలకు 28 పథకాలను ఎందుకు నిలిపివేశారు?
4) అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకంలో అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
5) ఎస్సీ, ఎస్టీ లలో వెనుక బడిన వారికి.. పునరావాసాలను ఎందుకు ఆపేశారు?
6) వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు?
7) అంబేద్కర్ స్టడీ సర్కిళ్లకు డబ్బులు ఇవ్వడం ఎందుకు ఆపేశారు?
8) సొంత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఎందుకు వెనుకేసుకువస్తున్నారు?
9) రైతులకు సాగు భూములు పంచేకార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు?
కట్ చేస్తే.. వీటిని వైసీపీ ఎలా చూస్తుంది? ఎలాంటి సమాధానం చెబుతుంది? అనేది చూడాలి.
This post was last modified on May 1, 2024 3:12 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…