వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన తర్వాత.. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. వైసీపీ మేనిఫెస్టోను పట్టుకుని తిరుగుతున్నారు. అంటే.. ఒకరకంగా వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇది పాజిటివ్‌గా కాదు.. యాంటీగా మాత్రమే. “బాబును గెలిపించకపోతే.. అమరావతిని మరిచిపో వడమే” అని తాడికొండ(అమరావతి ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం) నాయకులు చెబుతున్నారు.
ఇంటింటికీ వెళ్లి.. వైసీపీ మేనిఫెస్టో జిరాక్స్ కాపీలను టీడీపీ నాయకులు పంచుతున్నారు. “చూడండి. మీకు అమరావతి కావాలంటే.. టీడీపీకి అండగా ఉండాలి” అని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన 2024 మేనిఫెస్టోలో రాజదాని నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా.. తాను విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తానని చెప్పారు. దీనిని ఆయన గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు. కానీ, ఇదే టీడీపీకి, కూటమి పార్టీలకు కూడా అస్త్రంగా మారింది.
గుంటూరు ఎంపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా వైసీపీ మేనిఫెస్టోలోని లోపాలను వివరిస్తున్నా రు. ముఖ్యంగా చంద్రబాబు కనుక రాకపోతే.. ఇక, అమరావతి ఉండదని.. రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు. అయితే.. అనేక పథకాల విషయంలోనూ వైసీపీ దోబూచులాడింది.
వాటిని పక్కన పెట్టినా.. అమరావతి విషయాన్ని మాత్రం టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇప్పటికే పదేళ్లుగా రాజధాని లేదు. ఉన్న ఉమ్మడి రాజధాని కూడా.. గడువు తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్పుకొనేందుకు, చూసుకునేం దుకు కూడా అమరావతి లేదు. రైతులు చేసిన త్యాగాలు కూడా వృథా అవుతున్నాయి. ఇక, ఇప్పుడు వైసీపీ తేల్చి చెప్పేసింది. తాము వస్తే.. విశాఖ నుంచే పాలన ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on April 28, 2024 7:51 pm
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…