ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరంటే ఒకరికి పడని నాయకులు చేతులు కలుపుతున్నారు. ఒకరంటే.. ఒకరు నిప్పులు చెరిగే నేతలు.. కౌగిలించుకుని.. ఎన్నికల పోరులో ప్రత్యేకత చాటుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు.. మాజీ ముఖ్యమంత్రులు.. నారా చంద్రబాబు.. నల్లారి కిరణ్‌లు మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన వారు. జిల్లా ఒకటే అయినా.. పార్టీలు వేరు.. ప్రాంతం ఒకటే అయినా.. సిద్ధాంతాలు వేరు. రాద్ధాంతాలు కూడా వేరు. పైగా.. 40 ఏళ్ల రాజకీయ శత్రుత్వం!!
ఒకరి ఇంటిపై కాకి ఒకరి ఇంటిపై వాలనంత రాజకీయం. అయితేనేం.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు కలిపిన నేపథ్యంలో ఆ శత్రుత్వాన్ని.. రాజకీయ రాద్ధాంతాలను పక్కన పెట్టారు. చేతులు కలిపారు. కలసి వేదికలు.. వాహనాలు కూడా పంచుకున్నారు. పక్క పక్కన నిలబడి మీటింగుల్లో ప్రసంగాలు దంచి కొట్టారు. దీంతో ఈ దృశ్య అందరికీ ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో మార్పు ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చర్య పడేలా చేసింది. నారా వారి కుటుంబం.. నల్లారి కుటుంబం ఆదిలో కాంగ్రెస్‌లోనే ఉండేవి. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తండ్రి తొలినాళ్లలో కాంగ్రెస్‌లో ఉండేవారు.
ఆయన వారసత్వంగానే కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కిరణ్ తండ్రి.. నారా చంద్రబాబుకు రాజకీయ గురువు కావడం విశేషం. ఇలా.. సాగిన ప్రస్తానం.. తర్వాత చంద్రబాబు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో.. మారిపోయింది. అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రం .. పార్టీల వరకు కూడా.. నిప్పులు చెరిగే నాయకులుగా మారిపోయారు. ఎదురెదురు పడింది లేదు. పడినా పలకరించుకున్నదీ లేదు. ఇక, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా(వైఎస్ హయాం) చేసిన నల్లారిపై సభలోనే చంద్రబాబు నిప్పులు చెరిగారు. పక్షపాతం చూపుతున్నారని.. మైకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని.. ఆయన వ్యాఖ్యానిస్తే.. మీరే హద్దులు మీరుతున్నారని నల్లారి ఎదురు దాడి చేసిన సంగతి ఇప్పటికీ తెలిసిందే.
ఇక, నల్లారి ముఖ్యమంత్రిగా చేసిన(వైఎస్ మరణాంతరం) సమయంలోనూ బాబు వర్సెస్ నల్లారిల మధ్య అసెంబ్లీ వేదికగా అనేక సందర్భాల్లో నిప్పులు కురిశాయి. బాబు విధానాలను నల్లారి తీవ్రస్థాయిలో ఎండగట్టేవారు. ఇక, నల్లారి పాలనను బాబు దుయ్యబట్టేవారు.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. నల్లారి తెలంగాణకు పరిమితం కాగా.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న దరిమిలా.. నల్లారి.. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఇక్కడ కూటమి పక్షాన.. నల్లారిని పక్కన పెట్టుకుని మరీ ప్రచారం చేయడం గమనార్హం.
This post was last modified on April 26, 2024 11:05 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…