Political News

మన ప్రముఖుల డేటా ఆలీబాబా ద్వారానే డ్రాగన్ కు చేరిందా ?

అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. దేశంలోని సుమారు 10 వేలమంది ప్రముఖుల వ్యక్తిగత, అధికారిక డేటా మొత్తాన్ని చైనా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. భారత్ తో ప్రత్యకంగా పోరాటం చేయలేని డ్రాగన్ దేశం దొంగదెబ్బ తీయటానికి రెడీ అయిపోయిందట.

చైనా దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ గ్రూపు, వాణిజ్యసంస్ధ ఆలీబాబా ద్వారా మనదేశంలోని అత్యంత ప్రముఖుల డేటాను తీసేసుకుందని ప్రభుత్వానికి నివేదిక అందింది. మనదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నఅనేక పరిశ్రమలు, వాణిజ్యంసంస్ధలు అంతర్జాతీయ స్ధాయిలో కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఆలీబాబా సంస్ధను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి.

మనదేశంలోని సంస్ధలు విదేశాల్లో వ్యాపార విస్తరణ చేసుకోవాలంటే మంచి ప్లాట్ ఫారం అవసరం. అందుకనే ఆలీబాబా అందిస్తున్న టెక్నాలజీ గ్రూపు సర్వర్లను ఉపయోగించుకుంటున్నాయి. ముందుగా ఈ సర్వర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మొదటిసారి నమోదు చేసుకునేటపుడు అంతా ఉచితం అనే పద్దతినే ఆలీబాబా కూడా వినియోగదారులను ఆకర్షిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

తర్వాత్తర్వాత కొంత కాలానికి సేవలు నిరాఘాటంగా సాగేందుకు మరిన్ని వివరాలను అప్ డేట్ చేయమని నిర్భందిస్తాయి. దాంతో వాళ్ళడిగిన డేటా మొత్తాన్ని వినియోగదారులు అందిస్తారు. ఇలాంటి 72 సర్వర్ల ద్వారా దేశంలోని ప్రముఖుల డేటా మొత్తం చైనాకు చేరిందని నిఘా వర్గాలు ఓ నివేదికను కేంద్రానికి అందించాయి.

తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా సంచలనం మొదలైంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రజ్ఞులు, సెలబ్రిటీలు తదితరుల డేటా మొత్తం ఇపుడు చైనా గుప్పిట్లో ఉందనే వార్త నిజంగా ఆందోళనకరమనే చెప్పాలి.

ఈ విషయంలో అనుమానం వచ్చిన తర్వాత కేంద్రం మనదేశంలోని చైనా యాప్ లన్నింటిపైనా నిషేధం విధించింది. అయినా ఇంకాకొన్ని యాప్ లు పనిచేస్తున్నట్లు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు జూమ్ యాప్ చాలా విస్తృతంగా వాడుకలో ఉంది. ఈ యాప్ చైనాదని కొందరు కాదు అమెరికాదే అని మరికొందరు వాదిస్తున్నారు.

This post was last modified on September 19, 2020 6:17 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago