ఏపీ సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన సభలో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కట్టుకునే చీరలపై ఆయన వ్యాఖ్యలు సంధించారు. పసుపు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. కుమారుడి వివాహ పత్రికను ఇవ్వడంతోపాటు.. స్వీట్లు, కానుకలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను కట్టుకున్నారు. ఇది అనుకుని చేశారో.. లేదా.. యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరూ కూడా.. దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. ఇది సభ్యత కూడా కాదని అందరికీ తెలిసిందే.
కానీ, తాజాగా సీఎం జగన్.. ఇదే చీరపై కామెంట్లు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ.. నాటి ఘటనను ప్రస్తావించారు. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు.
“తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా…
మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?“ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మరి ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.
This post was last modified on April 25, 2024 5:47 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…