ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ, శాసనసభ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆశించారు. ఆ స్థానం బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
గతంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్దమయ్యాడు. ఆ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. మూడు రోజుల పాటు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు.
2017 నవంబరులో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై ఫిర్యాదులు రావడంతో ఆరునెలల పాటు పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత హైకోర్టు పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తివేసింది.
ఆ తర్వాత ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఇన్నాళ్లకు ఆంధ్రాలో హిందూపురం ఎన్నికల తెర మీదకు వచ్చారు.
This post was last modified on April 24, 2024 11:44 am
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…