వారంతా ఎండకన్నెరగని కోటీశ్వరులు. ఏపీలో పుట్టారు.. ఏసీలోనే పెరిగారు.. ఇప్పుడు కూడా ఏసీల్లోనే జీవిస్తున్నారు. కాలు బయట పెట్టగానే కార్లు. అవికూడా లగ్జరీ కార్లు. ఎక్కడికి వెళ్లాలన్నా.. విమానాలు. తీసుకునే ఆహారం.. పూటకు రూ.5 వేల వరకు ఉంటుందని అంచనా. ఇదీ.. పరిస్థితి! కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఇలాంటి వీరంతా.. మండుటెండలకు, ఉక్క పోతలకు కిక్కిరిసిపోతున్నారు. అయినా.. తప్పడు.. మే 13 ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
ఎవరెవరు?
ప్రస్తుతం పార్లమెంటు విషయాన్ని తీసుకుంటే.. ఏపీలో కోటీశ్వరులు చాలా మందే ఉన్నారు. కోట్లకు పడగ లెత్తారు. అసలు వారు రోడ్డు మీదన నడవాల్సిన అవసరమే లేదు. కానీ.. ప్రజల ఓట్ల కోసం.. సభల్లో అడు గు వేసేందుకు వారు రోడ్డెక్కుతున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. వీరిలో అత్యధిక ధనవంతు డు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ఆస్తి 5 వేల కోట్లు. కాలు కదిపితే.. ఆయన ముందు రోల్స్ రాయస్ వాలిపోతుంది. కానీ, ఇప్పుడు పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతున్నారు.
కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ చీఫ్.. వైఎస్ షర్మిల.. పుట్టుకతో కోటీశ్వరురాలు. మెట్టినిల్లు కూడా అంతే. ప్రస్తుతం ఆమె చూపిన ఆస్తి.. 200 కోట్లు. అయినా.. ఆమె కాలు బయట పెట్టాల్సిన అవసరం లేనంత విలాసవంతమైన జీవితం ఉంది. కానీ, రోడ్డెక్కారు. తెలంగాణలో చేవెళ్ల నుంచి బరిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు రూ.4 వేల కోట్లకు పైమాటే. ఈయన కూడా.. రిచ్ రాయల్ పొజిషన్ లోనే ఉన్నారు. ఈయన ఇంటికి రెండు గేట్లు.. ఆ గేట్లు దాటిన తర్వాత.. కూడా.. మూడు నిమిషాలు కారులో ప్రయాణిస్తే తప్ప.. ఇంటి ద్వారం వద్దకు చేరుకునే పరిస్థితిలేదు! ఇలాంటి కొండా.. చేవెళ్లలో చెమటలు కారుస్తున్నారు.
నెల్లూరు నుంచి బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా.. అత్యంత మోస్ట్ రాయల్ జీవితాన్ని గడుపు తున్న నాయకుడు. నెల్లూరులోని ఆయన ఇంటి ఆవరణలో పెరుగుతున్న గ్రీనరీ.. విదేశాల నుంచి తీసుకువచ్చిన ఖరీదైన గ్రీనరీ. అంతేకాదు.. విదేశీ పక్షులు, జంతువులు ఆయన ఇంట్లో ముందుగా మనకు స్వాగతం పలుకుతాయి. ఇక, భార్య, భర్తలకు ఏకంగా 12 అత్యంత అధునాతన కార్లు ఉన్నాయి. కాలు తీస్తే.. కారు.. అన్నట్టు రాజభోగం. అయితేనేం.. ఇప్పుడు మండు టెండలో మాడిపోతూనే ప్రచారంలో ఉన్నారు. వీరే కాదు.. 50 కిలోల వెండి, 5 కిలోల బంగారం ఉన్న వారు కూడా.. రోడ్డెక్కి ఓటర్లకు దండాలు పెడుతున్నారు.
కట్ చేస్తే: ఈ అపర కోటీశ్వరులు చెబుతున్నది తాము వచ్చింది ప్రజాసేవకేనని!
జనం టాక్: రూపాయి లేకుండా ప్రజా సేవ చేసిన వారు కూడా ఉన్నారని!! ఈ రెండు వాదనలకు చాలానే వ్యత్యాసం ఉన్నా.. ప్రజాస్వామ్యంలో రాజకీయ అండ ఉంటే మరింత సేవ చేస్తామనేది నేతల వాదన.
This post was last modified on April 23, 2024 7:30 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…