అదే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న కదా మరి అప్పుడే ఫలితం ఎలా వెల్లడయింది అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. పార్లమెంటు ఎన్నికల్లో చాలా అరుదయిన గెలుపు భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరిపోయింది. సూరత్ ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వజ్రాల నగరం సూరత్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది.
దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 6 విడతల్లో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదు శాసనసభ స్థానాలను ఏక గ్రీవంగా కైవసం చేసుకొని సంచలనం రేపింది. తాజాగా లోక్ సభ ఎన్నికల ముందే తొలి లోక్ సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానానికి బీజేపీ తరుపున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్ కుభానీలు బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో ఏడుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే వీరంతా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
స్థానిక ఎన్నికల్లో సాధారణంగా ఉండే ఇలాంటి సంఘటనలు ప్రస్తుత రాజకీయాల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల పరిధిలో అరుదు, అపూర్వం అని చెప్పాలి. ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో అక్కడి బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
This post was last modified on April 22, 2024 6:20 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…