బీఆర్ఎస్ పార్టీ కీలకనాయకురాలు.. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. ఈ క్రమం లో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు సీబీఐ సైత.. ఆమెపై పంజా విసిరింది. ఈ కేసులు ఎప్పటికి తేలుతాయో కూడా చెప్పడం కష్టమే. అయితే.. సంచలనం రేపిన ఈ కేసుపై కవిత తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. కవితను అరెస్టు చేసి, జైలుకు తరలించి దాదాపు నెల రోజులకు పైగానే అయిపోయినా.. కేసీఆర్ ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. అయితే.. తాజాగా ఆయన బీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత అరెస్టుపై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీని దుర్మార్గుడిగా అభివర్ణించారు. ఆయన ఉద్దేశ పూర్వకంగానే కవితను అరెస్టు చేయించారని దుయ్యబట్టారు. మన ఎమ్మెల్యేలను కొనేందుకు బీఎల్ సంతోష్ వంటి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. మనం గట్టిగా ప్రతిఘటించాం. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న మోడీ.. ఏదో ఒకరకంగా మనపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నారు. అందుకే లిక్కర్ కేసును చూసుకున్నారు. కవితను అరెస్టు చేశారు. ఈ కేసులో ఏమీ లేదు. అంతా ఉత్తుదే. లిక్కర్ .. బొక్కర్‌లేదు!
అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో 12-15 స్థానాల్లో విజయం దక్కించుకునేందుకు కార్యవర్గం శ్రమించాలని కేసీఆర్ సూచించారు. అందరూ గెలిచే వాళ్లనే రంగంలో దింపామన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అందరూ కలిసి పనిచేస్తే.. గెలుపు పెద్ద కష్టం కాదని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై రైతులు, సామాన్య ప్రజలు ఆగ్రహంతోఉన్నారని.. వారిని మనకు అనుకూలంగా మార్చుకుంటే గెలుపు ఈజీ అవుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఏకపక్షం అయ్యేలా కార్యకర్తలను ప్రోత్సహించాలన్నారు. ఈ సీటును ఎట్టి పరిస్థితిలోనూ వదులు కోకూడదని తేల్చి చెప్పారు.
This post was last modified on April 18, 2024 6:26 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…