2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు వైఎస్ వివేకానందరెడ్డి.. కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతను చూ స్తే.. ఎవరికైనా పాపం
అనిపించకమానదు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ఒక పార్టీకి ఆమె సభ్యురాలు కాకపోయినా.. కడపలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కోసం.. సునీత చాలా ప్రయాస పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పినట్టే ఆమె రంగంలోకి దిగారు.
నిన్న మొన్నటి వరకు వాహనంపైనే ప్రచారం చేసిన సునీత.. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తర్వాత.. రోడ్డు బాట పట్టారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. వీధివీధికీ తిరుగుతున్నారు. వీధి వ్యాపారులను కలుస్తు న్నారు. వారి అంగళ్ల ముందే మోకాళ్లపై కూర్చుని.. చేతిలో చేయి వేసి.. వివేకానందరెడ్డి దారుణ హత్యను వివరిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని.. అర్ధిస్తున్నారు. అంతేకాదు.. హస్తం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
నిజానికి ఇప్పటి వరకు కూడా.. వివేకానందరెడ్డి కుటుంబం నుంచి ఏ ఒక్కరూ రోడ్డెక్కింది లేదు. రాజకీ యంగా అంతా ఆయనే చూసుకున్నారు. కడపలో ఆయన గురించి తెలియనివారు కూడా లేరు. కానీ, ఆయన మరణం తర్వాత.. తొలిసారి ఆయన కుమార్తె సునీత తెరమీదికి వచ్చారు. అయితే.. తన తండ్రి కి న్యాయం జరిగితే చాలని తొలినాళ్లలో ఆమె కోరారు. కానీ, రాజకీయంగా దీనివెనుక అనేక అడ్డంకులు ఉన్నాయని గ్రహించినట్టు ఆమె చెప్పారు.
ఈ క్రమంలో వాటిని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు ఎన్నికల బాట పట్టారు. అయితే.. తాను స్వయంగా పోటీ చేయకపోయినా.. షర్మిల పక్షాన మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఎండకన్నెరగకుండా పెరిగిన సునీత.. ఇప్పుడు రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఓట్లు అర్ధించడం.. తన తండ్రికి న్యాయం చేయాలని కోరడం వంటివి చూస్తే.. పాపం.. సునీత!! అని మనసున్న వారికి ఎవరికైనా అనిపించకమానదు.
This post was last modified on April 18, 2024 3:55 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…