నా భార్య గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏనాడూ ఆమె గురించి బహిరంగ వేదికపై చెప్పుకొనే పరిస్థితి రాలేదు. దీనికి కారణం.. ఆమె ఇంటి గడప దాటి ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదు. అలాంటింది జగన్ మూకలు.. నా భార్యను కూడా కష్టపెట్టారు. ఆమె కన్నీరు పెట్టుకునే పరిస్థితిని కల్పించారు. అసెంబ్లీలోనూ.. బయటా నానా మాటలు అన్నారు. దీంతో ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఇలాంటివాళ్లా మహిళల గురించి.. వారి అభివృద్ధి గురించి మాట్లాడేది. ఇలాంటి వాళ్లా.. మహిళల అభ్యున్నతి కోసం ఏదో చేస్తామని చెప్పేది! అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజకవర్గంలో తాజాగా పర్యటించిన చంద్రబాబు.. ఇక్కడ ఎన్నికల ప్రచార సభ ప్రజాగళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని చూపిస్తూ.. ఈమెకు తెలుసు. నా భార్య భువనేశ్వరి ఎప్పుడూ గడప దాటలేదు. కానీ, జగన్ మూకలు.. నా భార్యని నానా మాటలు అన్నారు. కడాన.. అసెంబ్లీలోనూ అవమానిం చారు. నారా లోకేష్ గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ బిడ్డగా ఆమె ఏ రోజూ ఇలాంటి మాటలు వినలేదు. అలాంటిది ఆమెనే అనే సరికి తట్టుకోలేక పోయింది. కన్నీరు పెట్టుకుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గత ఏడాది తనను అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 3 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు.. అభిమా నులు గుండెలు పగిలి చనిపోయారు. ఇక, అప్పుడు నారా భువనేశ్వరి బయటకు వచ్చారని తెలిపారు. ప్రతి కుటుంబాన్నీ ఓదార్చారని.. నునున్నానంటూ.. ఆమె ధైర్యం చెప్పి.. తండ్రి ఇచ్చిన డబ్బులు.. తాను సంపాయించుకున్న డబ్బుల నుంచి ఒక్కొక్క కుటుంబాన్నీ ఆదుకుందన్నారు. ఇంటి నుంచి బయటకే అడుగు పెట్టని భువనేశ్వరి.. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పర్యటించి.. 9 వేల కిలో మీటర్ల మేరకు ప్రయాణించి.. పార్టీ అభిమాన కుటుంబాలకు దన్నుగా నిలిచారని చంద్రబాబు వివరించారు.
మహిళలకు ఎవరు ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఎవరు ఏడిపిస్తున్నారో.. ఎవరు వారికి అభివృద్ధి పథకాలు అందించాలని భావిస్తు న్నారో.. ఎవరు ఆట వస్తువులగా భావిస్తున్నారో గుర్తించాలని ఈ సందర్భంగా పేరు చెప్పకుండానే వైసీపీని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా పార్టీకి అండగా ఉండాలన్నారు. వారిని లక్షాధికారులను చేసే బాధ్యత తాను తీసుకుంటాన న్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతోపాటు.. 15 వేల రూపాయల అమ్మకు వందనం నిధులు ఇస్తామన్నారు.
This post was last modified on April 15, 2024 9:23 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…