ఏపీ సీఎం జగన్‌పై రాయి వేసిన ఘటన నుంచి ఇంకా రాజకీయాలు కోలుకోక ముందే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఒక వ్యక్తి రాయి విసిరాడు. అయితే.. అది తృటిలో తప్పిపోయి. సిబ్బంది చేతికి తగిలింది. అయితే.. పట్టపగలే కావడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో పెద్ద గందరగోళం చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
ఎన్నికల ప్రచారం కోసం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెనాలిలో పర్యటించారు. వారాహి వాహనంపై ఆయన తెనాలిలో ప్రచారం ప్రారంభించారు. స్థానిక అభ్యర్థి, పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ .. ఇతర నాయకులు.. వారాహిపై ప్రచారం చేస్తున్న సమయంలో ఆగంతకుడు ఒకరు గుంపులో నుంచి రాయి విసిరాడు. అయితే.. ఈరాయి.. తృటిలో పవన్ కళ్యాణ్‌కు ఎడమ వైపు నుంచి దూసుకుపోయి.. సిబ్బందికి తగిలింది.
దీంతో వారాహి యాత్రలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే.. ఈ ఘటన సాయంత్రం 6 గంటలకు జరగడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు వెంటనే గుర్తించి.. పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే.. అతను వైసీపీ సానుభూతిపరుడని జనసేన నాయకులు చెబుతున్నారు. పోలీసులు అతనిని స్టేషన్‌కు తరలించారు.
This post was last modified on April 14, 2024 7:14 pm
శివ కార్తికేయన్.. తమిళంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మొదలు పెట్టి స్టార్‌గా ఎదిగిన హీరో. తన జర్నీ గురించి తెలిస్తే…
శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని…
ఇప్పుడంటే తమన్, అనిరుధ్, డీఎస్పి అంటూ కొత్త తరం సంగీతంలో మునిగి తేలుతున్నాం కానీ ఒకప్పుడు విలక్షణమైన మ్యూజిక్, విభిన్నమైన…
భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్…
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్‌లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…
మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…